Tuesday, September 18, 2007

శిశువు

శిశువు బొటనవేలు నొట్లో వేసుకుని …. గుర్రం జాషువా గారి ‘గోరుముద్దలు ‘సంకలనం.
చిన్ని శిశువు, చిన్ని శిశువు …….అన్నమయ్య సంకీర్తన.
అన్నీంటికీ మూలం శిశువు జీవితం.
ఫుట్టినప్పటి నుంచీ పరుగు పెట్టే వరకూ ఉన్న ఆ సమయం ఎంతో అందమైనది.
శిశువు ఆ ఇంటికి మహారాజు.
ఆ సమయంలో జరిగే ప్రతీ సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు.ఆప్పుడు జరిగే కొన్ని వేడుకలు.
ఫుట్టగానే తీపిని పంచుతారు.

బోర్లాపడ్డప్పుడు -------- బొబ్బట్లు,
ఆల్లరి చేస్తే -------- చిల్లర,
పాకినప్పుడు -------- పాకం ఉండలు,
కూర్చున్నప్పుడు -------- కుడుములు,
అడుగులేసినప్పుడు -------- అరిసెలు,
చిన్న చిన్న మాటలకు-------- పంచదార చిలకలు,

పంచిపెడతారు.

ఇవి కాక నెల పుట్టినరోజులు, భోగి పళ్ళు ఇలా చాలానే ఉంటాయి.

Sunday, September 16, 2007

శివుడి రంగు

మనం చాలా చిత్రాలలో శివుడిని నీలం రంగులో గమనిస్తాము. మనం శివుడిని నీలకంఠుడు అని పిలుస్తాము. ఆటువంటప్పుడు శివుడి కంఠం మాత్రమే నీలం రంగులో ఉండాలి. కాబట్టి శివుడి రంగు నీలం కాదు.
దీనికి సంబంధించి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్వాతి సపరివార పత్రిక లో నన్ను అడగండి శీర్షికలో మాలతి చందూర్ గారు ఇచ్చిన సమాధానం !

ప్రశ్న: శ్రీ క్రిష్ణుడిని నీల మేఘ శ్యాముడన్నారు. శివుడు తెలుపా? నలుపా?
సమాధానం:

'పార్వతీ పతి తెల్పు, పాల సంద్రము తెల్పు,
కామధేనువు తెల్పు, కంచు తెల్పు,
కల్పవ్రుక్షము తెల్పు, కైలాసగిరి తెల్పు,
మల్లెపూవులు తెల్పు, మంచు తెల్పు,'

అని కదా చాటువు చెపుతున్నది.

Thursday, September 13, 2007

మక్కి కి మక్కి

ఒక పనిని ఉన్నది ఉన్నట్లుగా ఏ మాత్రం అలోచించకుండా అలాగే చేయడాన్ని మక్కి కి మక్కి చేయడం అంటారు.ఇలా అనడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని 1996-97 లో నేను 9 వ తరగతి చదువుతూ ఉండగా మా తెలుగు గురువు గారు శ్రీ ఓంకారశర్మ గారు చెప్పారు.
పూర్వ కాలం లో కథలు, కావ్యాలు అన్ని కూడా తాటి ఆకుల మీద రాసేవారు. తాటి ఆకుల జీవిత కాలం చాలా తక్కువ. అందుకని పాత కావ్యాలు, కధలు పాడైపోయినప్పుడల్లా కొత్త తాటి ఆకుల పై రాసి జాగ్రత్త చేసేవారట. సాధారణంగా ఆ పనిని అప్పటి రాజులు కవుల చేత వారి ఆస్థానం లో చేయించేవారట.
అలా ఒకసారి ఒక కావ్యం రాస్తునప్పుడు ఒక పాత కావ్యంలో ఒకచోట ఒక చచ్చిపోయిన ఈగ కనిపించిందట ఒక కవి గారికి. వెంటనే అతను తన కొత్త కావ్యంలో అదే చొట మరో ఈగను చంపి అతికించి తన కావ్యాన్ని పూర్తి చేసాడట.
సంస్క్రుతం లో మక్కి అంటే ఈగ అని అర్థం. ఒక ఈగ ఉన్న స్థానాన్ని మరో ఈగతో నిలిపి ఉంచాడు కనుక అది మక్కి కి మక్కి అయ్యింది అని, అలా ఆ జాతీయం వాడుక లో కి వచ్చిందని మా గురువు గారు చెప్పారు.

తేనె లాంటి తెలుగు

ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు వినాయకుని పుజించడం మన సాంప్రదాయం.ముందు ఆయన ధ్యానం తొనె మొదలు పెడుతున్నాను
శుక్లాం బరధరం విష్నుం, శశివర్నం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేథ్, సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం, ఏకదంతము పాస్మహే

మళ్ళీ కలుద్దాం.....