మనం చాలా చిత్రాలలో శివుడిని నీలం రంగులో గమనిస్తాము. మనం శివుడిని నీలకంఠుడు అని పిలుస్తాము. ఆటువంటప్పుడు శివుడి కంఠం మాత్రమే నీలం రంగులో ఉండాలి. కాబట్టి శివుడి రంగు నీలం కాదు.
దీనికి సంబంధించి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్వాతి సపరివార పత్రిక లో నన్ను అడగండి శీర్షికలో మాలతి చందూర్ గారు ఇచ్చిన సమాధానం !
ప్రశ్న: శ్రీ క్రిష్ణుడిని నీల మేఘ శ్యాముడన్నారు. శివుడు తెలుపా? నలుపా?
సమాధానం:
'పార్వతీ పతి తెల్పు, పాల సంద్రము తెల్పు,
కామధేనువు తెల్పు, కంచు తెల్పు,
కల్పవ్రుక్షము తెల్పు, కైలాసగిరి తెల్పు,
మల్లెపూవులు తెల్పు, మంచు తెల్పు,'
అని కదా చాటువు చెపుతున్నది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మంచి విషయం అందించారు
మీరు టపా లు క్రమం తప్పకుండా రాస్తారని
అశి్స్తు న్నాను ( ము )
Post a Comment